![]() |
![]() |
బిగ్ బాస్ సీజన్-9 మొదలై రెండు వారాలు పూర్తి కాబోతుంది. ఇందులోకి మర్యాద మనీష్, మాస్క్ మ్యాన్ హరీష్, డీమాన్ పవన్, దమ్ము శ్రీజ, ప్రియా శెట్టి ఇద్దరు కామనర్స్ గా ఎంట్రీ ఇచ్చారు. వీరంతా అగ్నిపరీక్షలో జడ్జెస్ ని ఇంప్రెస్ చేసి హౌస్ లోకి వచ్చారు. కామనర్స్ గా ఎంట్రీ ఇచ్చిన వీళ్లపై ఆడియన్స్ కి భారీ అంచనాలు ఉన్నాయి కానీ రెండు వారాలు గడుస్తున్నా వీరిలో ఒక్కరంటే ఒక్కరు కూడా బెస్ట్ పర్ఫామెన్స్ ఇవ్వలేదు. ఇక దమ్ము శ్రీజ, ప్రియా శెట్టి ఇద్దరు ఫిమేల్ కంటెస్టెంట్స్ ఏదో ఆడతారని నవదీప వాళ్ళని లోపలికి పంపించాడు కానీ తీరా చూస్తే ఎప్పుడు ఏదో ఒకటి టాపిక్ ని తీసుకొని దాని గురించి మాట్లాడుతూ అందరికి చిరాకు తెప్పిస్తున్నారు. వీళ్ళిద్దరిపై సోషల్ మీడియాలో ట్రోల్స్ మాములుగా రావడం లేదు.
వీకెండ్ ఎపిసోడ్ లో రెండు టాస్క్ లకి ప్రియ సంఛాలాక్ గా ఉంది. తను సంఛాలక్ గా ఉన్న రెండు టాస్క్ లకి కూడా రాంగ్ డెసిషన్ ఇచ్చింది. తను ఇచ్చిన రాంగ్ డెసిషన్స్ ని నాగార్జున ఆధారాలతో సహా వీడియో ప్లే చేసి మరీ చూపించాడు. అది చూసి ప్రియకి మొహం ఎక్కడ పెట్టుకోవాలో అర్ధం కాలేదు.. కాలచక్రం టాస్క్ లో తప్పు నిర్ణయం తీసుకుంది.. అలాగే రెంటర్స్ లో ఒకరు పర్మినెంట్ ఓనర్ అయ్యే టాస్క్ లో సుమన్ శెట్టిని రాంగ్ డెసిషన్ తో తప్పించింది. ఆ టాస్క్ లో సుమన్ శెట్టి చేతిలో క్లాత్ ఉంటుంది. దానిని లాగడానికి ఫ్లోరా, సంజన ప్రయత్నించగా సుమన్ శెట్టి తన చేతితో క్లాత్ ని కొడతాడు. కానీ ఫ్లోరా, సంజనని కొట్టాడని టాస్క్ నుండి ఎలిమినేట్ చేస్తుంది ప్రియ. ఆ వీడియోని బిగ్ స్క్రీన్ పై నాగార్జున ప్లే చేసి చూపిస్తాడు. సారీ అన్నా అని సుమన్ శెట్టితో ప్రియా చెప్తుంది. ఇప్పుడు ఓనర్ అయ్యే టాస్క్ అయిపోయింది కదా ఇప్పుడేం చేయలేము.. ఇప్పుడు ఓనర్ గా నాకు ఛాన్స్ ఇస్తారంటే నీ సారీ ఆక్సెప్ట్ చేస్తానని ప్రియకి సుమన్ శెట్టి(Suman Shetty) కౌంటర్ వేస్తాడు. దాంతో నాగార్జున నవ్వుకుంటాడు.
ఇక వీకెండ్ లో ప్రతీదానికి అవసరమున్నా లేకపోయినా మేం మాట్లాడుతామంటూ హ్యాండ్ రేస్ చేస్తున్నారు ప్రియా, శ్రీజ. దాంతో నాగార్జునకి కోపం వచ్చి ప్రతీసారీ మాట్లాడుతుంటే మధ్యలో వస్తారు. ఎందుకు ఎప్పుడు ఎదుటి వారిలో తప్పు వెతికే పనిలోనే ఉంటారని నాగార్జున స్ట్రాంగ్ కౌంటర్ వేస్తాడు నాగార్జున.
![]() |
![]() |